| Daily భారత్
Logo




ఆపద సమయంలో అతివలకు అండగా నిజామాబాదు షి టీం బృందం

News

Posted on 2025-10-04 20:31:17

Share: Share


ఆపద సమయంలో అతివలకు అండగా నిజామాబాదు షి టీం బృందం

మహిళలు,చిన్నారుల భద్రత సురక్షత ముఖ్యం.

ఈ నెల లో ఆకతాయిల వేధింపుల పై ప్రత్యేక దృష్టి సారింపు.

మహిళలను వేధించిన, మహిళల సమస్యల కై అందుబాటులో నిజామాబాదు షీ టీం

గత నెలలో 80 సార్లు హాట్స్పాట్ ల తనిఖీ.

11 ఈ పెట్టి కేసుల నమోదు.

07  కౌన్సిలింగ్ నిర్వహించి సమస్య పరిష్కారం.

నిజామాబాద్ సిపి పి.సాయి చైతన్య వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఆపద సమయంలో అతివలకు అండగా నిజామాబాదు షి టీం బృందం 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య  తెలిపారు. జిల్లాలో మహిళలు , చిన్నారుల భద్రతకై , రక్షణకై నిజామాబాదు జిల్లా షీ టీం బృందం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల రక్షణకై విధులను నిర్వర్తిస్తుందని , ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ దుర్గా నవరాత్రి ఉత్సవాలలో రాత్రి సమయాలలో ఆకతాయిలు అల్లరి చేస్తూ మహిళలను వేధించిన సందర్భాలలో రెడ్ హ్యాండెడ్ గా ఈ నెలలో 19 కేసులు నమోదు చేసినట్లు , షీ టీం బృందం ప్రత్యేకంగా రాత్రి సమయాలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో సంచరిస్తూ మహిళలను వేధిస్తున్న వారిపై దృష్టి సారించిందని తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా నిజామాబాదు షీ టీం బృందాలు యువతులకు , విద్యార్థిని విద్యార్థులకు , పని స్థలాలలో మహిళలకు ప్రత్యేకంగా 26 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్య పరచడం జరుగుతుందని, ఈ సందర్భంగా సెప్టెంబర్ నెలలో షీ టీం బృందాల ద్వారా 11 ఈ పెట్టీ కేసుల నమోదు చేయడం జరిగిందని తెలిపారు. షీ టీం బృందాలు గత నెల రోజులలో జిల్లా వ్యాప్తంగా 80  హాట్స్పాట్ల లో తనిఖీ చేయడం జరిగిందన్నారు. పలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. షి టీం బృందం సభ్యులు చాకచక్యంగా వ్యవహరిస్తూ నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక బృందంచే మహిళలకు రక్షణగా , మహిళలు వేధింపులకు గురికాకుండా అడ్డుపడుతూ ఆకతాయిల పట్ల చట్టపరంగా వ్యవహరిస్తూ ఉందని తెలిపారు. 07 కౌన్సిలింగ్ ల ద్వారా కేసులలో పరిష్కారం చూపబడింది అని తెలిపారు. ఆపత్కాల సమయంలో నిజామాబాద్  షి  టీం బృందాల ను సంప్రదించాలంటే 8712659795నంబర్ కు ఫోన్ ద్వారా సంప్రదించాలన్నారు.  26  గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహించి మహిళల పట్ల జరిగే నేరాలపై , చైల్డ్ మ్యారేజ్ , సైబర్ నేరాలపై , సోషల్ మీడియా నేరాలపై , చిన్నారులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ లపై అవగాహనలు కల్పించి చైతన్యపరచడం జరిగిందని తెలియజేశారు. ఈ నెలలో మహిళల సమస్యలతో దాదాపు 07 మొబైల్ ఫోన్ కాల్స్ వచ్చినట్లు వారికి తగిన సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. షీ టీం బృంద సభ్యులు మహిళా ఆర్ ఎస్ ఐ శ్రవంతి ,  హెడ్ కానిస్టేబుల్లు  సుమతి , ఆశయ్యా , కానిస్టేబుల్ లు విగ్నేష్ , శ్రీకాంత్ , నాగరాజు , రేఖా రాణి , హరిత రాణి , రాధిక మరియు మహిళా సిబ్బంది షీ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహిళలకు , చిన్నారులకు రక్షణగా నిజామాబాదు పోలీస్ వ్యవస్థ 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని హామీ ఇచ్చారు.

Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >