Posted on 2025-10-01 16:52:48
మా కోసం వెతకొద్దంటూ హెచ్చరిక
డైలీ భారత్,ఇంటర్నెట్ డెస్క్: ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటాము. వారిని అరెస్ట్ చేసి చూపిస్తామని పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే వెబ్ సైట్ ఐబొమ్మకు మాజీ సీపీ సీవీ ఆనంద్ రెండు రోజుల క్రితం హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు ఐబొమ్మ నిర్వాహకులు అంతే స్థాయిలో బదులిస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించారు.
ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం అని ఆ మెసేజ్ లో ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ కు ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా మీ ఓటీటీ రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారని పేర్కొంది. అంతేకాక మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. మా వెబ్ సైట్ ను బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయటపెడతాం అని వార్నింగ్ ఇచ్చింది. మమ్మల్ని టార్గెట్ చేస్తే ఇండస్ట్రీకి పెద్ద షాక్ వస్తుందని పేర్కొంది. రూ. 5 కోట్ల యూజర్లను ఒకేసారి రివీల్ చేయగలమని హెచ్చరికలు జారీ చేసింది.
5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉంది. మీడియా, ఓటీటీ, హీరోలకూ షాకింగ్ వార్త రివీల్ అవుతుంది. ప్రతి యూజర్ ఫోన్ నంబర్ మా డేటాబేస్ లో నిక్షిప్తమై ఉంది. దేశం మొత్తంలో మా సపోర్ట్ ఉంది. మా వెబ్‌సైట్ బ్లాక్ చేస్తే - మీరే ఎక్స్ పోజ్ కు గురవుతారు. ఫ్యాన్స్ కు సీక్రెట్ గా ఉన్న హీరోల పేర్లు బయట పెడతామని పేర్కొంది.
కొన్ని ప్రొడక్షన్ హౌజ్ లు, యూట్యూబ్ ఛానళ్లు ఉద్దేశపూర్వకంగా ఐ బొమ్మను తప్పుగా ప్రచారం చేస్తున్నాయని, తాము ఎలాంటి హ్యాకింగ్, ఫోన్ ట్రాకింగ్ చేయబోమని మరోసారి హామీ ఇచ్చింది. అలాగే తమది ఒక భారతీయ సైట్ అని, తెలుగు ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉన్నామని ఐ బొమ్మ స్పష్టం చేసింది. హీరోలకు వందల కోట్లు రెమ్మునరేషన్ ఇచ్చి.. భారీ బడ్జెట్ లు చూపించి సామాన్య ప్రేక్షకులపై ఆ ప్రభావం చూపుతున్నారని ఐ బొమ్మ మండిపడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ గా మారింది. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >