| Daily భారత్
Logo




పట్టణ కేంద్రంలో జరిగిన దొంగతనాన్ని 24గంటల్లోనే చేదించిన సూర్యాపేట పోలీసులు

News

Posted on 2025-10-01 18:17:00

Share: Share


పట్టణ కేంద్రంలో జరిగిన దొంగతనాన్ని 24గంటల్లోనే చేదించిన సూర్యాపేట పోలీసులు

ఇంట్లో పని చేసే పనిమనిషి దొంగతనానికి పాల్పడింది.

మొత్తం 55 లక్షల విలువైన సొత్తు రికవరీ.

53 లక్షల విలువైన 43.6 తులాల బంగారము, రూ.1.75 లక్షల నగదు సీజ్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు.


వివరాలు వెల్లడించిన నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట పట్టణం కృష్ణానగర్ కాలనీలో 80 సంవత్సరాల ఒక వృద్ధురాలు ఇంట్లో జరిగిన దొంగతనం కేసును సూర్యాపేట పట్టణ పోలీసులు, CCS పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. కేసు వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ గారు వెల్లడించారు. కేసును ఛాలెంజింగ్ తీసుకుని కేసులో ఉన్న ఆదారాలతో సూర్యాపేట పట్టణ మరియు CCS పోలీసులు ఒక్కరోజులోనే కేసు ఛేదించారు. బాధితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు దొంగతనం నమోదు చేసి త్వరితగతిన దర్యాప్తు చేశారు.

నిందితుల వివరాలు : 

1) కరీమా బేగం వయసు 45 సంవత్సరాలు, నాయకెన్ గూడెం గ్రామం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా, ప్రస్తుతం  కృష్ణా నగర్ కాలనీ, సూర్యాపేట పట్టణం.

స్వాధీనం వివరాలు :

1. 40 తులాల బంగారు బిస్కెట్లు.

2. 3.6 తులాల చంద్రహరం (కూసుమంచి SBI Bank లో ఉన్నది)

3. రూ.1.75 లక్షల నగదు. (మొత్తం విలువ 55 లక్షలు )

కృష్ణానగర్ కాలనీలో వృద్ధురాలు ఒంటరిగా ఉంటున్నది,  ఈమె కుమారులు ముగ్గురు హైద్రాబాద్ లో ఉంటారు, ఈ వృద్ధురాలికి సేవలు చేయడం కోసం వృద్ధురాలు కుమారులు పనిమనిషిని ఏర్పాటు చేశారు.  నమ్మకంగా పనిచేస్తూ వృద్ధురాలి వద్ద తాళం చేతులు గమనించి ఆమె ఇంట్లో ఉన్న 40 తులాల బంగారు బిస్కెట్లు (4 బిస్కెట్లు), మూడున్నర తులాల బంగారు చంద్రహారం, నగదును అపహరించింది. వృద్ధురాలి కుమారులు ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు తేదీ 29/9/2025 రోజున ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు పై దొంగతనం కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది, దర్యాప్తులో భాగంగా వృద్ధురాలి ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఉన్న పనిమనిషి కరీమా బేగం, వయసు 45 సంవత్సరాలు, నాయకెన్ గూడెం గ్రామం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా, ప్రస్తుతం కృష్ణా నగర్ కాలనీ, సూర్యాపేట పట్టణం మహిళలను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నది. ఆమె వద్ద నుండి 40 తులాల బరువు గల నాలుగు బంగారు బిస్కెట్లు  1.75 లక్షల రూపాయల నగదును, మూడున్నర తులాల ఛంద్రహరం తాడు (బ్యాంక్ లో ఉన్నది) సీజ్ చేసి ఈరోజు కోర్టుకు హాజరు పరచడం జరుగుతుంది. బంగారం విలువ 53 లక్షలు నగదు కలుపుకొని మొత్తం 55 లక్షల సొత్తును సూర్యాపేట పట్టణ పోలీసులు రికవరీ చేశారు. నిందితురాలు కోర్టుకు రిమాండ్ నిమిత్తం హాజరు పరచడం జరుగుతుంది. ఎస్పి గారి వెంట సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, SI లు శివతేజ, సురేష్, సిబ్బంది ఉన్నారు.

ఈ కేసులో బాగా పనిచేసిన సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, CCS  ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్సై శివతేజ, ఎస్ఐ సురేష్, సూర్యాపేట పట్టణ పోలీసు సిబ్బందిని, సిసిఎస్ సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించి రివార్డ్స్ అందించడం జరిగింది.

Image 1

ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

Posted On 2026-07-02 12:30:41

Readmore >
Image 1

ఎస్సైని లంచ్‌ టైం వరకు నిలబెట్టిన హైకోర్టు!

Posted On 2026-07-02 12:29:56

Readmore >
Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >