| Daily భారత్
Logo




PRC వెంటనే ప్రకటించాలి : TPTF రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి

News

Posted on 2025-09-17 08:19:30

Share: Share


PRC వెంటనే ప్రకటించాలి : TPTF రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి

పెండింగ్ D.A. లు చెల్లించాలి

 ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి

317 బాధితులకు వెంటనే న్యాయం చేయాలి

TPTF రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి డిమాండ్

డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ  అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు మందాడి శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల కృష్ణ చైతన్య, చందుర్తి మండల అధ్యక్షులు తాటికొండ సంజీవ్, ప్రధాన కార్యదర్శి, కొత్తూరు శ్రీధర్ ల ఆధ్వర్యంలో సమస్యల సేకరణలో భాగంగా  పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల్లోని సమస్యలను సేకరించడం జరిగింది  ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్ 5 డి. ఎ. లు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.. అంతేకాకుండా ఎన్నో రోజులుగా 317 బాధితులకు న్యాయం చేస్తామని చెప్తున్న ప్రభుత్వం న్యాయం చేయకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది అని  వెంటనే వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు, అదేవిధంగా  ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులకు TET నుండి మినహాయించాలని, అసంబద్ధ నిబంధనల పేరుతో దాదాపుగా 20 సంవత్సరాల పైన సర్వీస్ పూర్తిచేసిన ఉపాధ్యాయులను TET రాయమనడం అన్యాయం, అని వారికి టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు

ప్రభుత్వం ఏర్పడిన వెంటనే PRC ప్రకటిస్తామని చెప్పి, ఇంతవరకు ప్రకటించక పోవడం అన్యాయం అని వెంటనే PRC ప్రకటించాలని డిమాండ్ చేశారు,

ఈ కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షులు మందాడి శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల కృష్ణ చైతన్య, చందుర్తి మండల అధ్యక్షులు తాటికొండ సంజీవ్, TPTF బాధ్యులు కొత్తూరు శ్రీధర్, పాము వెంకట్, కర్ర శ్రీధర్, రాచకొండ ప్రసాద్, లు పాల్గొన్నారు.

Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >