Posted on 2025-09-17 09:31:06
జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా జిల్లా కేంద్రంలో బిజెపి శ్రేణులు నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యేధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతు భారతమాత ముద్దుబిడ్డ మూడోసారి భారతదేశ ప్రధానిగా సేవాలాందిస్తున్న నరేంద్రమోదీ గారు నేడు ప్రపంచ స్థాయి నాయకునిగా ఎదగడం భారతీయులంతా గర్వించదగ్గ విషయం అని అన్నారు. అందులో భాగంగా జిల్లాలో మొదటి రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. భారతదేశన్ని విశ్వగురువుగా నిలబెట్టలనే సంకల్పంతో, భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న నరేంద్రమోడీ జన్మదినానికి జిల్లా వ్యాప్తంగా సేవకార్యక్రమాలు నిర్వహించి దేశ ప్రధాని కి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. నిరంతరం భారతమాతకు సేవలాందిస్తున్న ఆ మహనీయులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, బీజేపీ నాయకులు న్యాలం రాజు, రానాదీష్, మండల అధ్యక్షులు నాగరాజు,బీజేపీ ఓబీసీ నాయకులు, స్వామి యాదవ్, గిరి బాబు, డాక్టర్ రాఘవేంద్ర , ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బీజేపీ నాయకులు ఆనంద్, సంజయ్ పురోహిత్,నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >