| Daily భారత్
Logo




తెలంగాణ పోరాట యోధుల పటిమను భావి తరాలకు తెలియజేయాలి

News

Posted on 2025-09-17 08:14:01

Share: Share


తెలంగాణ పోరాట యోధుల పటిమను భావి తరాలకు తెలియజేయాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు దినేష్ కులాచారితో కలిసి అర్బన్ ఎమ్మెల్యేధన్ పాల్ సూర్యనారాయణ  త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే  మాట్లాడుతు కాసిం రాజ్వి లాంటి క్రూర మృగాలు మన తెలంగాణ ఆడబిడ్డల మానాలు దోచుకుని బట్టలిప్పి బతుకమ్మ ఆడించిన సందర్భంలో ఎదురు తిరిగిన ఎందరో తెలంగాణ సాయుధ పోరాట వీరులను సజీవంగా దహనం దుర్మార్గుడు నిజాం నవాబు అని అన్నారు. పోరాడితే పోయేది ఏమీ లేదని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాంజీగోండ్‌, దొడ్డి కొమురయ్య,చాకలి ఐలమ్మ,దాశరధి కృష్ణమాచార్యులు, షోయబుల్లా ఖాన్ ఎందరో మహనీయులు నిజాంకు ఎదురుతిరిగి ప్రాణాలు అర్పించారని అన్నారు. తెలంగాణ బిడ్డల ఆత్మగోషాను అర్ధం చేసుకున్న సర్ధార్ వల్లభాయ్ పటేల్ 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో (పోలీస్ యాక్షన్ )తో నిజాం మేడలు వంచి, నిజాం కబంద హస్తల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడం జరిగిందన్నారు. తెలంగాణ బిడ్డలకు 1948 సెప్టెంబర్ 17న నిజమైన స్వాతంత్రం లభించిందని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవనికి ప్రతీక అయినా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపకుండా గత ప్రభుత్వం బి ఆర్ ఎస్ , ఇప్పటి కాంగ్రెస్ తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని ఓ వర్గం దగ్గర తాకట్టు పెడుతున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను గుర్తించి, తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. నిజాం నవాబు నిరంకుశ పాలనకు ఎదురుతిగిన తెలంగాణ పోరాట వీరుల పటిమను భావి తరాలకు తెలియజేయాలన్నారు. నిజాం ఆనవాళ్ళను పూర్తిగా చేరిపివేయాలి అందులో భాగంగా నిజామాబాదును ఇందూర్ జిల్లాగా పేరు మార్చాలని డిమాండ్ చేసారు. తెలంగాణ ఉద్యమానికి ఉపిరి పోసిన ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కళాశాల పేర్లు మార్చి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన తెలంగాణ బిడ్డల పేర్లు పెట్టాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు న్యాలం రాజు,జిల్లా ఉపాధ్యక్షులు పాలేపు రాజు,జిల్లా కార్యదర్శి జోతి గారు,జిల్లా బీజేపీ నాయకులు,బీజేపీ మండల అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు,  తదితరులు పాల్గొన్నారు.



Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >