Posted on 2025-09-16 08:14:44
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:దేశ వ్యాప్తంగా సోమవారం ఇంజనీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశంలో ఇంజనీరింగ్, మౌలిక సదుపాయాల రంగంలో విశేష కృషి చేసిన ఇంజనీర్ల సేవలను గౌరవించి, అంకితం చేయబడిందే ఈ ఇంజనీర్ల దినోత్సవం.ప్రముఖ ఇంజనీర్, పండితులు, భారతరత్న మోక్షగుండం విశ్వశ్వరయ్య పుట్టినరోజు ను ఇంజనీర్ల దినోత్సవం గా జరుపుకుంటారు. ఆధునిక సమాజ నిర్మాణం లో ఇంజనీర్ల పాత్ర అనిర్వచనీయం, అద్భుతాలు సృష్టించాలన్న సమాజాన్ని సాంకేతిక రంగం లో అగ్రపథాన నిలపాలన్న అది ఇంజనీర్లతోనే సాధ్యం. ఈ సందర్బంగా జిల్లా కేంద్రం లోని ఆకాశవాణి కేంద్రంలో ఇంజనీర్స్ డే ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతు ఆధునిక సమాజం లో ఇంజనీర్ల పాత్ర అత్యున్నతమైనదిగా కొనియాడారు. ఆకాశవాణి లో ఇంజనీర్ల సహాయ సహకారాలతో కార్యక్రమాలు స్పష్టంగా శ్రోతలకు చేరుతున్నాయన్నారు. ఈ సందర్బంగా కేంద్రం లోని ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది వెంకటసుబ్బయ్య, సుధాకర్,విలాస్, గోపాల్, జ్యోతిరాజ్, అశోక్ కుమార్, నవీన్ కుమార్, రమేష్, మహేందర్,మోహన్ దాస్, శరత్ సాయికుమార్,మదన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >