| Daily భారత్
Logo




ప్రియుడితో కలిసి భర్తపై కత్తితో దాడి చేసిన భార్య

News

Posted on 2025-09-15 19:22:53

Share: Share


ప్రియుడితో కలిసి భర్తపై కత్తితో దాడి చేసిన భార్య

డైలీ భారత్, మహబూబాబాద్:ప్రసాద్ భార్య రష్మితకు కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారానికి భర్త ప్రసాద్ అడ్డుగా ఉన్నాడని, అతడిని చంపాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.

ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే పెళ్లి చేసుకోవాలంటేనే యువకులు ఒణికిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేస్తున్న వరస ఘటనలే ఇందుకు కారణం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ఓ భార్య యత్నించింది.

ప్రసాద్ భార్య రష్మితకు కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారానికి భర్త ప్రసాద్ అడ్డుగా ఉన్నాడని, అతడిని చంపాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం, ఆదివారం అర్ధరాత్రి ప్రియుడు అనిల్‌తో కలిసి భర్త ప్రసాద్‌పై రష్మిత విచక్షణారహితంగా కత్తితో దాడి చేసింది.

ఈ దాడిలో ప్రసాద్ గట్టిగా కేకలు వేయడంతో స్థానిక ప్రజలు వెంటనే అప్రమత్తమయ్యారు. పారిపోతున్న ప్రియుడు అనిల్‌ను పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ ప్రసాద్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం, ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >