Posted on 2025-09-15 17:36:39
గౌడ కులస్తులు, వి డి సి సభ్యుల మధ్య తలెత్తిన వివాదం..
గ్రామంలో పోలీసుల పికెటింగ్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తాళ్ల రాంపూర్ గ్రామంలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామంలోని గౌడ కులస్తులు మరియు విడీసీ సభ్యుల మధ్య ఈత, తాటి చెట్ల విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. గ్రామస్తులు గౌడ కులస్తులపై దాడి చేయడంతో, సుమారు 30 మంది గౌడ కులస్తులు ప్రాణ భయంతో సంఘ భవనంలో గడియ పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాము గ్రామస్తుల నుండి ప్రాణహానికి గురయ్యే పరిస్థితి నెలకొన్నదని, వెంటనే రక్షణ కల్పించాలంటూ బాధితులు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల గ్రామంలో వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. ఈ ఉద్రిక్తతలో, న్యూస్ కవరేజ్ కోసం గ్రామానికి వెళ్లిన విలేకరులపై విడీసీ సభ్యులు దాడి చేసినట్లు సమాచారం. గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పోలీసులు తరలివచ్చి మొహరించారు. ఏ చిన్న ఘర్షణ జరగకుండా పరిస్థితిని శాంతింపజేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. విశేషమేమంటే, కేవలం నెల రోజుల క్రితమే జిల్లా జడ్జి, జిల్లా సీపీ ఆధ్వర్యంలో గ్రామంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ పరిస్థితి తీవ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే వరకు పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >