| Daily భారత్
Logo




మూడవ నంబర్ కల్లు డిపోలో స్థానికేతరులకు సభ్యత్వం ఇవ్వడం అన్యాయం

News

Posted on 2025-09-15 15:56:09

Share: Share


మూడవ నంబర్ కల్లు డిపోలో స్థానికేతరులకు సభ్యత్వం ఇవ్వడం అన్యాయం

ప్రజావాణిలో కలెక్టర్ కు తమ సమస్య విన్నవించిన అర్హులైన గీత కార్మికులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ మూడో కల్లు డిపోలో  అర్హులైన కార్మికులకు అవకాశం కల్పించకుండా.. స్థానికేతరులకు సభ్యత్వం ఇచ్చారని నగరానికి చెందిన గీత కార్మికుడు సురేష్​ గౌడ్​ వాపోయారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి  సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే సంఘంలో ఇతర సంఘాల్లో సభ్యులైన వారికి, టాపింగ్ టెస్టులో  పాల్గొనని వారికి, దుబాయ్​లో ఉన్నవారికి, ఉద్యోగం చేసుకునే వారికి సభ్యత్వం ఇవ్వడం సిగ్గుచేటన్నారు. కనీసం చెట్టు ఎక్కరాని వాళ్లకూ కూడా సభ్యత్వం ఇవ్వడమేమిటని వారు ప్రశ్నించారు. ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు తాత్కాలికంగా ఆధార్ కార్డులో  అడ్రస్ మార్చి సభ్యత్వం తీసుకున్నారని వాపోయారు. ప్రధానంగా సేపూరు స్వామి గౌడ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. వారి సొంత గ్రామంలో సభ్యులుగా ఉన్నారని, అయినా మళ్లీ ఇక్కడ తీసుకోవడం తగదన్నారు. వినతిపత్రం అందించిన వారిలో నవీన్, భిక్షపతి, ప్రవీణ్, మధు తదితరులున్నారు.

Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >