Posted on 2025-09-15 09:58:08
పదేళ్లుగా పింఛన్ కోసం తిరుగుతున్న ఓ వికలాంగుడు
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: నవిపేట మండలం మద్దెపల్లి గ్రామానికి చెందిన కేతావత్ బాబు పింఛన్ కోసం తన భార్య సహాయంతో సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణికి వచ్చి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందించారు. తాను గత పదేళ్లుగా పక్షవాతం వ్యాధితో పింఛన్ కోసం తిరుగుతున్నానని కానీ పింఛన్ రాకపోవడంతో తమ జీవనం రోజురోజుకు దీనంగా మారుతుందని దీనంగా మారుతుందని తన భార్య కూలి పని చేస్తే తప్ప వేరే ఆధారం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లు పింఛన్ కోసం తిరిగిన ఒక్క రూపాయి రాలేదని కనీసం స్లాట్ బుక్ కూడా చేసుకోలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్లాట్ బుక్ అయినా గాని పింఛన్ ఇవ్వడంలో అధికారులు జాప్యం వ్యవహరిస్తున్నారని కనీసం మీరైనా పట్టించుకోని తనకు పింఛన్ వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆయన ప్రాధేయపడ్డారు.
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >