| Daily భారత్
Logo




ఇటీవల వరద బీభత్సంతో నష్టపోయిన బోధన్ నియోజకవర్గ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

News

Posted on 2025-09-15 08:42:24

Share: Share


ఇటీవల వరద బీభత్సంతో నష్టపోయిన బోధన్ నియోజకవర్గ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ ను కలిసిన బోధన్ నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:ఇటీవల భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని బిజెపి బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి  మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బోధన్ నియోజకవర్గంలోని సాలూర మంజీరా పరివాహక ప్రాంతంలోని సరిహద్దు గ్రామాలైన రైతులకు అదేవిధంగా కందకుర్తి గోదావరి సరిహద్దు గ్రామాలైన నీలా, బోర్గాం, తాడి బిలోలి, రెంజల్, నవీపేట్ లోని కొన్ని ప్రాంతాల గ్రామాల రైతులు వరద ప్రభావానికి తీవ్రంగా నష్టపోయారని వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రెండో పంటకు విత్తనాలను వెంటనే ప్రభుత్వం సరఫరా రైతులకు అందివ్వాలి అన్నారు . వరద ప్రభావానికి పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు అర్హులైన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయాలని ఆయన కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. అలాగే ఇటీవల భారీ వర్షాలు వరద ప్రభావానికి దెబ్బతిన్న రైతులకు ఎకరానికి ప్రభుత్వం 30,000 ఆర్థిక సాయం అందజేయాలని ఆయన అన్నారు. అలాగే రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కష్టపడి పంట పండించే రైతులకు ఇన్సూరెన్స్ లేకపోవడం అన్యాయం అన్నారు.

Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >