| Daily భారత్
Logo




దశాబ్దాల చరిత్ర కలిగిన సార్వజనిక్ వినాయక శోభాయాత్ర ను సైతం వదలని రాజకీయ రగడ

News

Posted on 2025-09-06 16:27:49

Share: Share


దశాబ్దాల చరిత్ర కలిగిన సార్వజనిక్ వినాయక శోభాయాత్ర ను సైతం వదలని రాజకీయ రగడ

కాంగ్రెస్, బిజెపి నాయకుల మధ్య రగిలిన వాగ్వివాదం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన గణేష్ నిమజ్జనం శోభాయాత్రకు రాజకీయరంగు పులుముకుంది. ప్రతి ఏటా సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సార్వజనిక్ కమిటీ కన్వీనర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించడం సాంప్రదాయంగా జరుగుతోంది. ఎమ్మెల్యేలు లేనప్పుడు జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా జెండా ఊపి ప్రారంభించారు. గత తొమ్మిది రోజులుగా భక్తిశ్రద్ధలతో జరిగిన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా దుబ్బలో జరిగిన శోభయాత్ర ప్రారంభం రాజకీయ రగడగా మారింది. సార్వజనిక్ గణేష్ మండలి కన్వీనర్ బంటు గణేష్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించాల్సి ఉండగా వేడుకలకు ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఆయన కూడా జెండా ఊపేందుకు సిద్ధపడ్డారు. ముగ్గురు కలిసి చేయాల్సిన చోట ఒకరు మాత్రమే జెండా  ఊపడంతో వివాదానికి కారణమైంది.

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >