| Daily భారత్
Logo




నిబద్ధతతో పని చేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యం : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

News

Posted on 2025-09-06 16:25:49

Share: Share


నిబద్ధతతో పని చేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యం : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలు పంపిణీ చేసిన కలెక్టర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: నిబద్ధతతో పనిచేస్తేనే వ్యవస్థ మనుగడ సాధ్యం అవుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో  గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ,*   రెవెన్యూ శాఖ ప్రభుత్వంలో చాలా కీలకమని, ప్రభుత్వ భూముల సంరక్షణ, ప్రైవేటు పట్టా భూముల రికార్డుల నిర్వహణ, ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్ల జారీ వంటి అనేక కీలక బాధ్యతలు మన వద్ద ఉంటాయని తెలిపారు. 

జిల్లాలో  గ్రామ పంచాయతీలకు గ్రామ పాలన అధికారులను ప్రభుత్వం నియమించిందని, వీరు క్షేత్రస్థాయిలో ప్రజలకు నిబంధనల ప్రకారం మెరుగైన సేవలు అందించాలని, ఎక్కడా అవకతవకలకు పాల్పడటానికి వీలు లేదని స్పష్టం చేశారు.

సిటిజన్ చార్ట్ ప్రకారం ప్రజలకు సకాలంలో సేవలు అందేలా చూడాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అదనపు కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసిల్దార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని , గ్రామ పాలన అధికారుల పనితీరు నిరంతరం పర్యవేక్షిస్తామని వివరించారు.

3 సంవత్సరాల తర్వాత రెవెన్యూ శాఖకు గ్రామ పాలన అధికారుల రూపంలో విఆర్ఓ, విఆర్ఏ, జూనియర్ అసిస్టెంట్లు తిరిగి మాతృ శాఖ (రెవెన్యూ) రావడం జరుగుతుందని అన్నారు.  నేడు నియామక పత్రాలు పొందుతున్న అభ్యర్థులు వెంటనే విధులలో చేరాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏఓ రామ్ రెడ్డి , జీ.పి.ఓ. లు తదితరులు పాల్గొన్నారు.

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >