| Daily భారత్
Logo




స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ అందుల, మానసిక, దివ్యాంగుల పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

News

Posted on 2025-09-04 15:10:46

Share: Share


స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ అందుల, మానసిక, దివ్యాంగుల పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గురువారం స్థానిక మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ వారి అంధుల, మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రత్యేకమైనదని ఉపాధ్యాయులు పాఠాలు బోధించడమే కాకుండా వారిలో మంచి లక్షణాలైన, సేవా తత్పరత, సానుభూతి మరియు సహనం ఉన్నవారే మంచి ఉపాధ్యాయుడుగా ఎదుగుతారని ఆయన అన్నారు. సాధారణ పాఠశాలలో ప్రాథమిక దశలో విద్యార్థులకు బోధించడం చాలా కఠినతరమైనదని అందులోనూ దివ్యాంగులకు విద్యను బోధించడం చాలా క్లిష్టమైన విషయమని అందులకు విద్యాబోధన ద్వారా వారికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడం జరుగుతుందని మానసిక వికలాంగులకు బోధించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన చెప్పారు. స్నేహ సొసైటీ దివ్యాంగులకు అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి మాట్లాడుతూ దేవుడు అందరిని తాను చూసుకోలేక అమ్మను సృష్టించాడని ప్రతి ఇంటిలో అమ్మ దేవతలాగా సేవలందిస్తుందని మహిళా సంక్షేమ ద్వారా అర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించి చిన్న వయసులోనే పిల్లలకు శిక్షణను ఇవ్వడమే కాకుండా మంచి అలవాట్లు నేర్పించడం అదేవిధంగా వారిలో క్రమశిక్షణ అలవర్చటం చేస్తున్నామని విద్య అనేది విలువలతో  కూడినదిగా  ఉండాలని ఆమె అన్నారు. స్నేహ సొసైటీ ద్వారా మానసిక దివ్యాంగులు జాతీయస్థాయిలో యోగా ద్వారా పేరు తెచ్చుకున్నారని స్వాతంత్ర దినోత్సవం రోజు మానసిక వికలాంగులు పెరేడ్ గ్రౌండ్లో నృత్యం ద్వారా వారి ప్రతిభను చూపించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీలో పనిచేసే ఏ జ్యోతి ప్రిన్సిపాల్ మరియు డి. సునీత టీచర్ అంధుల ప్రత్యేక పాఠశాల, పి రాజేశ్వరి ప్రిన్సిపాల్, ఎన్ విమల టీచర్, సౌందర్య డాన్స్ టీచర్, మానసికంగా వికలాంగుల పాఠశాల నుండి సన్మానించారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న ఓంకార్ లక్ష్మి, ఏ స్వాతి, సందీప లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీచర్లుగా పనిచేసిన దివ్యాంగ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం దివ్యాంగ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >