| Daily భారత్
Logo




వరద బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది

News

Posted on 2025-09-04 15:09:02

Share: Share


వరద బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది

చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద కామారెడ్డి నీ కోలుకోనేనంత దెబ్బతీసింది..

అవసరమైతే ప్రత్యేక ప్యాకేజ్ నిధులు మంజూరు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం.

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: చరిత్రలో ఎప్పుడూ లేనంతగా కామారెడ్డి జిల్లాలో ఇటీవల వరద బీభత్సం తో ప్రజలు కోలుకోలేనంతగా దెబ్బతీసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వరద బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని ప్రజలకు భరోసాను కల్పించారు. ప్రభుత్వం మిమ్మల్ని కచ్చితంగా ఆదుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలు, వంతెనలు, రహదారులు, ప్రాజెక్టులను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలంలో పర్యటించారు. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా లింగంపేట్ మండలం లింగంపల్లి ఖుర్ద్ వంతెన (కేకే వై హైవే) ను సందర్శించి, అక్కడ తాత్కాలిక మరమ్మతులు చేయడం కాకుండా శాశ్వత వంతెన నిర్మాణానికి అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన బుర్గిద్ద నందు రైతుల పొలాలను పరిశీలించిన, మహిళా రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై రైతుల సమస్యలు విని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, పంటలు, చెరువులు, వాగుల పరిస్థితిని ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మొత్తం పరిస్థితిని సీఎం, మంత్రులకు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మీ ఎమ్మెల్యే మదన్ మోహన్ మీకు అండగా నిలిచి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూశారు. కష్టం వచ్చినపుడు అండగా ఉండే వాడే నాయకుడు మీకు అండగా ఉండి ఎమ్మెల్యే ఆదుకున్నారని తెలియజేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు

తోడుగా ఉండాలని నాయకులకు సూచిస్తున్నామన్నారు అన్నారు. వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడి మిమ్మల్ని కాపాడింది అని అన్నారు.

తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేశాంప్రత్యక్షంగా మీ కష్టాలను, జరిగిన నష్టాలను చూడటానికే ఇక్కడకు వచ్చామని శాశ్వతపరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించాం అన్నారు. పంట పొలాల్లో ఇసుక మేటలు తొలగించుకునేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తాం అని తెలిపారు, భారీ వర్షాలకు నష్ట పోయిన రైతులకు పంట నష్టపరిహారం అందిస్తాం అన్నారు. రోడ్డు, ప్రాజెక్టులను మరమ్మతులు చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించాలన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పూర్తిస్థాయిలో వరదనష్టాన్ని  అంచనా వేయాలి అని ఆదేశించారు.

Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >