Posted on 2025-09-04 17:29:03
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గురువారం గణేష్ నిమజ్జనాన్ని నిర్వహించారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన మట్టి గణేష్ విగ్రహానికి పూజలు నిర్వహించి ఉపాధ్యాయులు, విద్యార్థులు నృత్యాలు చేస్తూ గంగమ్మ ఒడిలో నిమజ్జనాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిలుక వేణు కిరణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.