Posted on 2026-06-23 21:29:53
అన్నతో పాటు సహకరించిన ఫీల్డ్ అసిస్టెంట్ అరెస్ట్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తప్పుడు పత్రాలు సృష్టించి తమ్ముడికి చెందిన ఇల్లును తన భార్య పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తిని, అతనికి సహకరించిన ఫీల్డ్ అసిస్టెంట్‌ను చందుర్తి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చందుర్తి ఎస్సై జిల్లెల రమేష్ తెలిపిన వివరాల ప్రకారం...చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన పులి నవీన్‌కు, అతని అన్న పులి శ్రీకాంత్‌కు మధ్య ఉమ్మడి ఇల్లు ఉంది. అయితే, తన అన్న ఆ ఇంటిని అక్రమంగా పట్టా చేయించుకోవాలని చూస్తున్నాడనే అనుమానంతో నవీన్ ‘మీ సేవా’ కేంద్రంలో ఈసీ తీసి పరిశీలించాడు. ఆ ఇల్లు అప్పటికే తన అన్న భార్య పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించి షాక్‌కు గురయ్యాడు. దీనిపై సనుగుల గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా.. తాము ఎలాంటి ఇంటి పట్టా జారీ చేయలేదని స్పష్టం చేశారు. అనంతరం చందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో విచారించగా, అక్కడ కూడా ఎలాంటి కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని తేలింది. బాధితుడు నవీన్ తన అన్న శ్రీకాంత్ చేసిన మోసాన్ని గుర్తిస్తూ చందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లిదండ్రుల డెత్ సర్టిఫికెట్, కుటుంబ ధ్రువీకరణ పత్రం, ఇంటి పన్ను రసీదులు, రిజిస్ట్రేషన్ ప్లాన్ సాక్షుల ఆధార్ కార్డులను నకిలీవిగా సృష్టించి, తనను మోసం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై జిల్లెల రమేష్ దర్యాప్తు చేపట్టి, నిందితుడైన అన్న పులి శ్రీకాంత్‌తో పాటు అతనికి నకిలీ పత్రాలు, రబ్బర్ స్టాంపులు తయారు చేయడంలో సహకరించిన కల్లేపల్లి శేఖర్ (ఫీల్డ్ అసిస్టెంట్)ను అరెస్ట్ చేశారు. పంచుల సమక్షంలో శేఖర్ వద్ద నుంచి నకిలీ రబ్బర్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకుని, నిందితులిద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన చందుర్తి ఎస్సై జిల్లెల రమేష్‌తో పాటు, దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బంది ప్రమోద్ కుమార్, కరుణాకర్, మనోహర్, ప్రవీణ్, రవిలను సీఐ రవీందర్ ప్రత్యేకంగా అభినందించారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >