| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

డైలీ భారత్, హైదరాబాద్: కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గంపా గోవర్థన్ బుధవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కొంపల్లి ప్రెస్టేజ్ సిటీలో నూతన గృహంలోకి అడుగు పెట్టారు.ఈ శుభ కార్యానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే.టీ.రామారావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,మాజీ లోకసభ సభ్యులు నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తదితర ప్రముఖులు హాజరై పూజలో పాల్గొని గోవర్థన్,ఆయన కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కేటీఆర్, రవిచంద్ర, నాగేశ్వరరావు, ప్రశాంత్ రెడ్డి,అజయ్ తదితర అతిథులను గోవర్థన్ పట్టు కండువాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Previous ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం
Next రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
ADVERTISEMENT