శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో 350 మందికి అన్నప్రసాద వితరణ
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.నేటి అన్న ప్రసాద దాతలుగా పసుపునూరి వెంకటరమణ కవిత దంపతుల కుమార్తె గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లి రోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ సేవకులు డాక్టర్ బాలు మాట్లాడుతూ గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లి రోజు సందర్భంగా పసుపు నూరి వెంకటరమణ కవిత దంపతులు ఆర్థిక సహకారాన్ని అందజేయడం జరిగింది వారి కుటుంబానికి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని సకల సంపదలను అమ్మ భగవానులు అనుగ్రహించాలని ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 350 మందికి అన్న ప్రసాదాన్ని అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్శి శ్రీనివాస్, దొంతి సుధాకర్,పప్పుల ఆంజనేయులు,రాజమణి,పప్పుల శ్రావణి,పాత స్వరూప,నీల అద్విక్ సాయి,నీల సాయి అద్విత లు పాల్గొనడం జరిగింది.