Posted on 2025-08-12 16:32:39
దేశ సమైక్యత కోసం నేటి తరం యువత పాటుపడాలి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: జాతీయ సమైక్యతను చాటేందుకే తిరంగా ర్యాలీ నిర్వహించినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని గాంధీచౌక్ నుంచి బస్టాండ్ మీదుగా తిలక్ గార్డెన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరేళ్ల క్రితం ప్రధాని మోదీ హర్ ఘర్ తిరంగా నినాదంతో కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. రాజకీయాలకతీతంగా ర్యాలీలో అన్ని వర్గాలు పాల్గొన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతం చేయడంలో సైనికుల వీరోచిత పోరాటానికి గుర్తు చేసుకుంటూ జాతీయ జెండాకు ఇచ్చే గౌరవమే తిరంగా ర్యాలీ అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఏడాది ఆగస్టు 15కు ముందు "హర్ ఘర్ తిరంగా" అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ.. ర్యాలీలో విద్యార్థులు ప్రదర్శించిన భారీ త్రివర్ణ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, పాల్గొన్నారు.
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >
సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!
Posted On 2026-07-25 11:36:32
Readmore >
బోరుబావుల కిందవరి సాగు వద్దు : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Posted On 2026-07-25 11:13:48
Readmore >