Posted on 2025-08-12 20:05:12
వెంటనే ప్రధానిగా మోడీ రాజీనామా చేయాలి
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
జిల్లా కేంద్రంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన కాంగ్రెస్ శ్రేణులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దేశంలో ఎలక్షన్ కమిషన్ ను అడ్డుపెట్టుకొని నరేంద్ర మోడీ చేసిన ఓట్ల దొంగతనానికి నిరసనగా మంగళవారం ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దహనం చేశారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.వెంటనే కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. విజయవంతంగా కాంగ్రెస్ నాయకులు నరేంద్ర మోదీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషన్ ను తన గుప్పిట్లో పెట్టుకొని దొంగ ఓట్లు సృష్టించి అధికారంలోకి రావడం జరిగిందని, రాహుల్ గాంధీ ఓట్లలో దొంగతనం జరిగిందని బయటపెట్టగానే ఎలక్షన్ కమిషన్ తన అధికారి వెబ్ సైట్ ను బ్యాన్ చేయడం జరిగిందని, ఒకవేళ ఎలక్షన్ కమిషన్ తప్పు చేయకుంటే ఎందుకు వెబ్ సైట్ ను బ్యాన్ చేశారో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాలుగా ఓట్ల నమోదు ప్రక్రియలో తప్పు జరుగుతుందని పదేపదే చెప్తున్న విషయం ఈరోజు వెలుగులోకి వచ్చిందని ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నూడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ను తన ఆధీనంలో పెట్టుకొని దేశంలో ఎన్నో వేల ఓట్లు దొంగతనం గా సృష్టించి మోడీ అధికారంలోకి వచ్చాడు తప్ప ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాదు అని ,దేశానికి నైతికంగా మోడీ ప్రధాని కాదు అని కేశ వేణు అన్నారు రాహుల్ గాంధీ గారు మోడీ చేసిన దొంగ ఓట్ల ప్రక్రియను బయటపెడితే బీజేపీ నాయకులు ఏం చేయాలో తెలీక రాహుల్ గాంధీ పై అవాక్కులు చవాకులు పేలుస్తున్నారని ప్రజలు ఇప్పటికైనా గమనించాలని ,నిజమైన నాయకులు ఎవరు స్వార్థాల కొరకు వ్యవస్థలను వాడుకుంటున్నారో గమనించాలని అన్నారు. కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్,రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ రామ కృష్ణ,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్,రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,జిల్లా sc సెల్ అధ్యక్షులు లింగం,జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు యాదగిరి,వివిధ ఆలయాల చైర్మన్ లు లవంగ ప్రమోద్, మధు సుధాన్,మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామ కృష్ణ,నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్,సంగెం సాయిలు, తదితరులు పాలన్నారు.
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >