Posted on 2025-08-12 17:01:49
డైలీ భారత్, బోధన్: మండలంలోని అంబం గ్రామ శివారు ఎన్ఎస్ఎఫ్ భూమిలో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇస్కాన్ సంస్థ చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను గుర్తించి బోధన్ ప్రాంతంలో ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి చెందిన నాలుగు ఎకరాల స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు భోజనం, ఉచిత విద్య, వృద్ధాశ్రమం ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలో భూ కేటాయింపు పత్రాలు అందజేస్తామన్నారు. అనంతరం బోధన్‌లోని ఉర్దూఘర్ను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు శ్రీకాంత్, నరసింహారెడ్డి, సుచిత్ర, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హుందాన్, కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్, బిల్లా రామ్మోహన్, ఎల్లయ్య యాదవ్, మల్కా రెడ్డి పాల్గొన్నారు.
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >