| Daily భారత్
Logo




లోయలో పడ్డ ఆర్మీ ట్రక్.. తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ మృతి

News

Posted on 2025-08-12 10:55:40

Share: Share


లోయలో పడ్డ ఆర్మీ ట్రక్.. తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ మృతి

డైలీ భారత్, జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌‌, శ్రీనగర్  ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్‌‌  సోమవారం చనిపోయినట్లు ఆర్మీ అధికారులు ఫ్యామిలీ మెంబర్స్‎కు సమాచారం అందించారు. డ్యూటీలో భాగంగా ఆర్మీ ట్రక్‌‌లో పెట్రోలింగ్ కు వెళ్తుండగా, ప్రమాదవశాత్తు ట్రక్‌‌ లోయలో పడిపోవడంతో ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సూర్యతండాకు చెందిన అనిల్‌‌ కుమార్(30) గల్లంతయ్యాడు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆర్మీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా, డెడ్​బాడీ లభ్యమైంది. 

సెలవులపై గ్రామానికి వచ్చిన అనిల్‌‌ కుమార్ 20 రోజుల కింద విధుల్లో చేరాడు. ఈ నెల10న తన బర్త్​డే సందర్భంగా భార్య, ఫ్యామిలీ మెంబర్స్‎తో మాట్లాడాడు. తోటి జవాన్లతో బర్త్​డే జరుపుకున్న ఫొటోలను కుటుంబ సభ్యులకు షేర్ చేశాడు. ఇంతలోనే అనిల్​కుమార్​ చనిపోయినట్లు ఆర్మీ అధికారులు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి భార్య రేణుక, 8 నెలల బాబు ఉన్నారు. అనిల్‌‌ మృతితో తండాలో విషాదం నెలకొంది.

Image 1

2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

Posted On 2025-12-08 19:32:03

Readmore >
Image 1

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు

Posted On 2025-12-08 18:21:39

Readmore >
Image 1

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

Posted On 2025-12-08 14:07:07

Readmore >
Image 1

రియల్టర్ దారుణ హత్య

Posted On 2025-12-08 13:49:01

Readmore >
Image 1

అన్ని దేవుళ్ళపై ఒట్టేసి మాట తప్పిన ప్రభుత్వం కాంగ్రెస్

Posted On 2025-12-08 13:38:14

Readmore >
Image 1

ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

Posted On 2025-12-08 13:06:39

Readmore >
Image 1

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Posted On 2025-12-08 13:05:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >
Image 1

ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2025-12-07 18:35:52

Readmore >