Posted on 2025-08-12 10:08:28
డైలీ భారత్, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు వద్ద ఉన్న ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఓ కార్మికుడు మృతిచెందారు. మంగళవారం ఉదయం ఎక్స్‌ప్లోజివ్ ప్లాంట్ బయట బాయిలర్ స్టీమ్ పైపు తెరుస్తుండగా ఒక్కసారి పేలుడు సంభవించి సదానందం(50) అనే కార్మికుడు అక్కడికక్కడే మరణించారు.
ప్రతీ రోజు మాదిరిగానే ఉదయం 7.30 గంటల సమయంలో బాయిలర్ స్టీమ్‌ను మరో ప్లాంటుకు మళ్లించే క్రమంలో స్టీమ్‌కు సంబంధించిన మూతను విప్పుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అక్కడ వీధుల్లో ఉన్న సదానందం అనే కార్మికుడు తలకు తీవ్రంగా గాయం కావడం అక్కడికక్కడే మృతి చెందాడని వెల్లడించారు. మృతుని స్వస్థలం గోదావరిఖని అని చెప్పారు. గత 25 ఏళ్లుగా ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నారని, ఆలేరు పట్టణంలో నివాసం ఉంటున్నారని తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా హాస్పిటల్‌కి తరలించామన్నారు.
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >