| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే నివాసంలో కాశీ విశ్వనాథునికి మహా రుద్రాభిషేకం

ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే నివాసంలో కాశీ విశ్వనాథునికి మహా రుద్రాభిషేకం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  ఆధ్వర్యంలో, మార్వాడిగల్లీలోని తన నివాసంలో శ్రావణ మాస పర్వదినాన్ని పురస్కరించుకొని కాశీ విశ్వనాథునికి భక్తిశ్రద్ధలతో మహా రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ పుణ్య కార్యక్రమంలో పది మంది ప్రముఖ వేద పండితులు పాల్గొని, శాస్త్రోక్తంగా మహాదేవునికి  గంగాజలంతో, పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు " ఇందూర్ జిల్లా ప్రజల ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి మరియు లోక కళ్యాణం కోసం ఈ రుద్రాభిషేకాన్ని  గత 50 ఏళ్లనుండి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాలు నిర్వహించడం వలన మన సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించడంతో పాటు మనశాంతి, దృఢ సంకల్పం కలుగుతుందన్నారు. మహాదేవుని  ఆశీస్సులతో సమాజం శాంతిగా, సుసంపన్నంగా ఉండాలి. ప్రజలకు మంచి జరగాలని మనసారా కోరుకున్నట్లు"  తెలిపారు. వేద ఘోషల నడుమ ఎంతో ఆధ్యాత్మికతతో సాగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Previous ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాది దారుల నుండి 22 ఫిర్యాదులను స్వీకరించిన సి పి సాయి చైతన్య
Next ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీలో పేలిన బాయిలర్ స్టీమ్.. కార్మికుడు మృతి
ADVERTISEMENT