Posted on 2025-08-10 18:01:07
కార్యాలయంలో ఉన్నత అధికారులు లేక లక్షల్లో ఉన్న పెన్షన్ పెండింగ్ ఫైళ్లు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాల్కల్ రోడ్డులో ఉన్న పి ఎఫ్ కార్యాలయంలో అసలైన ఉన్నతాధికారులు లేక ఏళ్ల తరబడిగా లక్షలాదిగా పెన్షన్ కు సంబంధించిన ఫైళ్లు పడి ఉన్నాయి. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పిఎఫ్ ప్రాంతీయ కార్యాలయాన్ని అప్పటి ఎంపీ దివంగత నేత కేశ్ పల్లి గంగారెడ్డి హయాంలో ఆయన ప్రత్యేక చోరవతో జిల్లాలో ప్రారంభమైంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వాలు జిల్లాల్లో ఉన్న పిఎఫ్ ప్రాంతీయ కార్యాలయం లో ఉద్యోగుల భర్తీ విషయంలో విముఖత చూపుతున్నారని విషయం తేటతెల్లమవుతుంది. ఈ కార్యాలయంలో అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ తో పాటు, సూపరిండెంట్లు, ఏవో, మిగతా అధికారుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీనివల్ల ఆధార్ లింకు సమస్య ఏర్పడడంతో లక్షకు పైగా పింఛన్ ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే బీడీ కార్మికులు, ఇతర ఉద్యోగులు ఎక్కువగా ఉన్న మన జిల్లాలో ఏళ్ల తరబడిగా పెన్షన్ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జిల్లా ఎంపీ ప్రాంతీయ కార్యాలయం పై ప్రత్యేక దృష్టి వహించి కార్యాలయంలో ఉన్నతాధికారులు ను నియమించే విషయంలో శ్రద్ధ వహించి కేంద్ర కార్మిక శాఖ మంత్రితో మాట్లాడి ఏళ్ల తరంగా పెన్షన్ కోసం వేచి చూస్తున్నా పెన్షన్ దారులు ఎంపీని విన్నవిస్తున్నారు. వృద్ధాప్య సమయంలో పెన్షన్ దారులకు పెన్షన్ రాకపోవడంతో తాము బతికేది ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >
సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Posted On 2026-07-31 05:03:03
Readmore >
అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్
Posted On 2026-07-31 05:01:23
Readmore >
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >