Posted on 2025-08-06 14:35:45
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధికారిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుస్సాపూర్ శంకర్ ఆధ్వర్యంలో నగరంలోని కంటేశ్వర్ లో గల ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ ప్రత్యేక తెలంగాణ కోసం ఉమ్మడి రాష్ట్రం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లో చైతన్యపరిచి ఉద్యమాలకు లేపారని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు జరిగే న్యాయం అభివృద్ధిపై అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అన్ని పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి తెలంగాణ ప్రజలకు న్యాయం చేసిన ఘనత ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ దేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉన్నంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారని ఆయన కొనియాడారు. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఆయన పోరాడి సాధించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మిరియాల సురేష్ కుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రేఖా ప్రసాద్ తో పాటు సంఘం కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >
వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-08-01 14:10:03
Readmore >
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >