| Daily భారత్
Logo




జూలూరుపాడు నుండి పాపకొల్లుకు డబల్ తారు రోడ్డు నిర్మాణం త్వరగా చేపట్టాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించిన జడల చింత గ్రామస్తులు

News

Posted on 2025-07-26 07:20:06

Share: Share


జూలూరుపాడు నుండి పాపకొల్లుకు డబల్ తారు రోడ్డు నిర్మాణం త్వరగా చేపట్టాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించిన జడల చింత గ్రామస్తులు

 డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాపకొల్లు నుండి జూలూరుపాడు వెళ్లే డబల్ రోడ్డు ఆరు నెలల కింద రోడ్డు పనులు ప్రారంభించారు కొంత మేరకు తారు రోడ్డు నిర్మాణం చేపట్టి  మిగతా రోడ్డు ఆపినారు మళ్లీ రెండు నెలల తర్వాత ఎర్రమట్టి రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగించినారు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు చిత్తడిగా మారింది  రోడ్డుకి ఇరుపక్కల మట్టి  నాసిరికంగా పోసినారు ఎర్ర మట్టి గుంతలు తేలింది నిత్యం ప్రతిరోజు ఈ రోడ్డు మార్గం నుండి 7 గ్రామపంచాయతీ 30 గ్రామల ప్రజలు తమ అవసరా నిమిత్తం కొరకు జూలూరుపాడు మండలానికి ప్రయాణం చేస్తూ ఉంటారు  రద్దీగా తిరుగుతున్నటువంటి ద్విచక్ర వాహనాలు వెహికల్స్ అదుపుతప్పి నిత్యం యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి కానీ ఎవరు పట్టించుకునే ప్రజాప్రతినిధులు కనుమరుగైనారు ఇకనైనా మేల్కొని ఈరోజు జడల్చింత గ్రామంలో గ్రామస్తులు ఆవేదనతో రోడ్డుపై బఠాయించి వైరా ఎమ్మెల్యే మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేపట్టినారు దక్షణమే రోడ్డు పనులు నిర్మాణం చేపట్టకపోతే అతి త్వరలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని అన్నారు ఈ  సందర్భంగా చరవాణి ద్వారా ఎమ్మెల్యే అతి త్వరలో రోడ్డు పూర్తి చేపిస్తానని హామీ  ఇచ్చినారు ఇట్టి విషయాన్ని తెలుసుకున్న జూలూరుపాడు పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ విరిపక్కల జామ్ అయింది ట్రాఫిక్ క్లియరెన్స్ చేసినారు. ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే పనులు  పట్టించుకోవటం లేదు దీనిపై ప్రభుత్వం గానీ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ విషయాన్ని ఆలోచించి త్వరగా తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలి అని అన్నారు  ఈ కార్యక్రమంలో జడల చింత గ్రామ ప్రజలు జూలూరుపాడు సిపిఎం మండల నాయకులు యాసనరేష్ , బానోత్, బలగాని సీతయ్య, హనుమంతురావు, మహిళలుధర్నాలో పాల్గొన్నారు

Image 1

ఈ నెల 25 నుండి కోటప్పకొండలో తొలి ఏకాదశి మహోత్సవాలు

Posted On 2026-07-24 09:07:06

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు

Posted On 2026-07-24 09:02:05

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ బాక్స్ కల్వర్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

Posted On 2026-07-24 09:00:44

Readmore >
Image 1

వంశీ ఆత్మహత్య ఘటన బాధాకరం : బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

Posted On 2026-07-24 04:25:46

Readmore >
Image 1

ఆర్మీ భూములు కాపాడాలంటూ హైడ్రాకు విన‌తిప‌త్రం

Posted On 2026-07-24 04:20:53

Readmore >
Image 1

గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్...

Posted On 2026-07-23 16:17:18

Readmore >
Image 1

ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం

Posted On 2026-07-23 16:06:22

Readmore >
Image 1

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-23 16:04:59

Readmore >
Image 1

వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-23 15:59:08

Readmore >
Image 1

మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు

Posted On 2026-07-23 15:56:26

Readmore >