Posted on 2026-07-24 09:00:44
డైలీ భారత్, హైదరాబాద్, రామంతపూర్: రామంతపూర్ భగాయత్ పరిధిలోని వెంకట సాయి నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన బాక్స్ కల్వర్ట్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ నూతన కమిటీ సభ్యులు, గౌరవ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, వెంకట సాయి నగర్ కాలనీ అభివృద్ధికి తను పూర్తి సహకారం అందిస్తానని వారు అన్నారు. కాలనీలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం, కొన్ని వీధుల్లో డ్రైనేజీ లైన్ల పనులను త్వరలోనే పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, అవసరమైన నిధులను మంజూరు చేయించి అన్ని అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గంధం నాగేశ్వరరావు, ఎండి జాంగీర్, నాయకులు, డాక్టర్ బి వి చారి ,కాలనీ అధ్యక్షుడు ఎ. విజయేందర్ రెడ్డి, సర్వ సత్తయ్య యాదవ్, రమేష్ గౌడ్, ఎం. రవికుమార్, సంజీవ్, శివశంకర్, ఆర్. గోవింద్, జి. అశోక్, సిహెచ్. శ్రీనివాస్ గౌడ్, కే. నవీన్ కుమార్, భూపతి నరసింహ గౌడ్, విద్యాసాగర్, రామకృష్ణ, వి. శివకుమార్, ఎం. ఐలేష్ యాదవ్, బి. చలపతిరావు, బి. రాములు గౌడ్, ఎం. రమేష్ యాదవ్, , రమేష్ శెట్టి, హరీష్, వేణుగోపాల్ రెడ్డి, సోమేష్, రాములు ,స్వామి , నరేష్, తదితరులు పాల్గొన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >