డైలీ భారత్, స్పెషల్:
మౌనస్వరాలే మన నేస్తాలు...
అవి కూడా మనలాగే
ఒకప్పుడు ఈ భూమి మీద,
అడవుల మధ్య, కొండల నడుమ,
ఎన్నో జీవులు స్వేచ్ఛగా తిరిగేవి.
కానీ…
మన స్వలాభం కోసం
అడవులను నరికివేస్తూ…
మన ఊపిరిని మనమే
ఆపేస్తున్నామని మరచిపోవద్దు..!
అభివృద్ధి పేరుతో
జంతువులే లేని లోకాన్ని సృష్టిస్తూ…
మనకు మనమే శూన్యం లోకి అడుగులు
వేస్తున్నామని మరచిపోవద్దు..!
నరికిన అడవి ఆకుల గుసగుసల్లో గాలి కవిత్వమై
మనలని హెచ్చరిస్తున్నది రోజులు దగ్గర పడ్డాయి అని..!
సమస్త జంతు ప్రాణాలు కాపాడుకుంటూ
వేడుకొంటున్నాయి కవిత్వమై నా కలాన్ని..!
జంతువు బతికితే అడవి బతుకుతుంది,
అడవి బతికితే ప్మనం బతుకుతాం…
కనుక అక్టోబర్ 4: ప్రపంచ జంతువుల దినోత్సవం
సందర్భంగా
ప్రకృతి ప్రేమికులారా అడవులను కాపాడుదాం..!
మినీ అడవులను ఏర్పడు చేద్దాం..
సమస్త జంతు ప్రాణాలకు స్వేచ్ఛ ఇద్దాం..!
రచన: శ్రీమతి మంజుల పత్తిపాటి
చరవాణి 9347042218
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
బ్రాహ్మణ సేవా వాహిని
యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు
తెలంగాణ రాష్ట్రం.