| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని అడిగినందుకు భర్తను చంపిన భార్య

ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని అడిగినందుకు భర్తను చంపిన భార్య

డైలీ భారత్, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేష్(33), జయశ్రీకి 11 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి ఇద్దరు కుమారులు..

మూడేళ్ల క్రితం విబేధాలు రావడంతో, పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిన జయశ్రీ రెండు నెలల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో చర్చించి, భార్యాపిల్లలను ఇంటికి తెచ్చుకున్న వెంకటేష్..

ఆదివారం బోనాల పండుగ సందర్భంగా వెంకటేష్ రాత్రి 11 గంటలకు ఇంటికి రాగా.. ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతూ కనిపించిన జయశ్రీ. ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతున్నావని జయశ్రీని నిలదీసిన వెంకటేష్..

దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా, జయశ్రీ తన భర్త చేతులు పట్టుకోగా, గొంతు నులిమి చంపేసిన జయశ్రీ తండ్రి పండరి..విషయం బయటకు రాకుండా సోమవారం ఉదయం ఆటోలో మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేసిన జయశ్రీ, ఆమె తండ్రి..

అది గమనించి పోలీసులకు సమాచారమిచ్చిన వెంకటేష్ తల్లి, అతని సోదరులు.. ఘటనా స్థలానికి చేరుకొని వెంకటేష్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జయశ్రీని, ఆమె తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు..!!

Previous శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో పోతేత్తిన భక్తులు
Next దుమ్ముగూడెం సీఐ కు డిఎస్పీ ఉద్యోగన్నతి
ADVERTISEMENT