Posted on 2025-07-18 19:56:57
నూతనంగా నిర్మిస్తున్న భవనంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
యువకుడి కుటుంబానికి తెలియజేయకుండానే పోస్టుమార్టానికి తరలించిన వైనం..
హడావిడిగా పోస్టుమార్టం కు తరలింపులో కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఓ ప్రజా ప్రతినిధి హస్తం ఉందని కార్మిక సంఘాల ఆరోపణ..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరంలోని మార్వాడి గల్లీ లో నూతనంగా నిర్మిస్తున్న భవనంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భవనంలో టైల్స్ పాలిష్ చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. అయితే ఈ విషయాన్ని బయటకు రాకుండా స్థానికంగా ఉండే ఓ ప్రజా ప్రతినిధి పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. సదరు ప్రజాప్రతినిధి ఒత్తిడితో హడావిడిగా కార్మికుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. అయితే కార్మికుడు చనిపోయిన వెంటనే భవన యజమాని, కాంట్రాక్టర్ కార్మిక సంఘం తో మాట్లాడి మృతుని కుటుంబానికి ఎంతో కొంత ముట్ట చెప్పేందుకు బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం.
దీనిపై వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఆటోనగర్ కు చెందిన ఉమర్( 32) అనే కార్మికుడు మార్వాడి గల్లీ లో నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్ లో పనిచేసేందుకు వచ్చాడు. టైల్స్ పాలిష్ పనిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని భవన యజమాని వెంటనే స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధికి తెలియజేశాడు. సదరు ప్రతినిధి వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరికి తరలించారు. ఇదిలా ఉండగా కరెంట్ షాక్ తో మృతి చెందిన ఉమర్ కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. అతని కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా గోప్యంగా ఉంచడం పట్ల పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భవన యజమానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు ఆందోళన చేపట్టారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >