Posted on 2025-07-10 20:55:18
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ట్రిపుల్ ఐటీ లో ఆర్మూర్ నియోజకవర్గం డొంకేశ్వర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి 27 మంది విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకుడు బైండ్ల ప్రశాంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు బైండ్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో డొంకేశ్వర్ మండల కేంద్రం లో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ ను గుర్తిస్తూ పాఠశాల విద్యార్థలు 27 మంది ఐఐఐటి లో సీట్లు సంపాదించినా సందర్బంగా వారికి శాలువాల తో సన్మానించారు. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలో చదివే పేద విద్యార్థుల కు అన్ని సౌకర్యాలు అందిస్తూ వారి ఎదుగుదల కు తొడ్పాటు అందిస్తున్నరు అని అన్నారు.
కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి, యువజన కాంగ్రెస్ ఉమ్మడి మండల అధ్యక్షులు గుండు హరీష్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బానోత్ సుమన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హరిదాస్, వైఎస్ గంగాధర్, నాగరాజు, అశోక్ యూత్ కాంగ్రెస్ నాయకులు గోపి,శివ శంకర్, వంశీ, కిషోర్, శ్యామ్, వెంకటేష్, చింటూ, సుధాకర్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >