| Daily భారత్
Logo




ఐటిఐ కోర్సుల్లో చేరి విద్యార్థులు భవిష్యత్తు బంగారు మయంగా మార్చుకోవాలి

News

Posted on 2025-07-10 19:56:29

Share: Share


ఐటిఐ కోర్సుల్లో చేరి విద్యార్థులు భవిష్యత్తు బంగారు మయంగా మార్చుకోవాలి

బాలుర ఐటిఐ కళాశాలను సందర్శించిన మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఐ టి ఐ లో ఉండే వివిధ కోర్సులలో చేరి విద్యార్థులు తమ భవిష్యత్తు బంగారుమయంగా మార్చుకోవాలని మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పారిశ్రామిక శిక్షణ సంస్థలను నిరుద్యోగ, యువతీ యువకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన హితవు పలికారు. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆయన గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ లో గల ప్రభుత్వ బాలుర ఐ.టి.ఐను సందర్శించారు. టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, స్టెనో తదితర ట్రేడ్ లకు సంబంధించిన వర్క్ షాప్ లు, తరగతులకు వెళ్లి నిశిత పరిశీలన జరిపారు. వివిధ ట్రేడ్ లలో అందిస్తున్న శిక్షణ తీరు గురించి, అందుబాటులో ఉన్న యంత్ర పరికరాల గురించి ప్రిన్సిపాల్ యాదగిరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐ.టి.ఐ లలో చేరిన వారికి మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా నాణ్యతతో కూడిన శిక్షణ అందించాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యార్థులతో మమేకమై, వారికి అందిస్తున్న శిక్షణ తీరుతెన్నుల గురించి వాకబు చేశారు. స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఐ.టి.ఐ శిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వీటికి అనుసంధానంగా నేటి పారిశ్రామిక ఆవసరాలకు అనుగుణంగా అధునాతన కోర్సులలో శిక్షణ ఇప్పించేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లను కూడా ప్రభుత్వం నెలకొల్పిందని గుర్తు చేశారు. ఐటిఐ లలో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి రైల్వే, బీడీఎల్, మిధాని వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా, సొంతగా పరిశ్రమలు స్థాపించుకునేందుకు, ప్రైవేట్ రంగంలో ఆకర్షణీయ వేతనాలతో బహుళ జాతి పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సాంకేతిక విద్యను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, యువతలో సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని అన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులు అయిన వారు నేరుగా ఐ.టి.ఐ లలో ప్రవేశాలు పొంది, తాము ఎంచుకున్న కోర్సులలో శిక్షణ పొంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకోవచ్చని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్లేస్ మెంట్ ల కోసం టాటా వంటి ప్రముఖ కంపెనీలతో కూడా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ప్రభుత్వ తోడ్పాటును విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఐ.టి.ఐలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఐ.టి.ఐ ఇన్స్ట్రక్టర్ లు ఉన్నారు.


Image 1

వలపు వల... దంపతుల ఎర

Posted On 2026-01-15 08:45:32

Readmore >
Image 1

బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-15 06:39:17

Readmore >
Image 1

విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-14 22:44:54

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు

Posted On 2026-01-14 18:45:43

Readmore >
Image 1

పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

Posted On 2026-01-14 17:46:55

Readmore >
Image 1

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-01-14 17:45:54

Readmore >
Image 1

సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

Posted On 2026-01-14 17:44:56

Readmore >
Image 1

వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-01-14 17:43:41

Readmore >
Image 1

గల్ఫ్ మృతదేహం తరలింపు... ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం

Posted On 2026-01-14 17:39:34

Readmore >
Image 1

బ్యాగ్‌ బరువు ఉండదక్కడ

Posted On 2026-01-14 15:26:21

Readmore >