| Daily భారత్
Logo




రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు : కె. నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా

News

Posted on 2025-07-07 17:31:42

Share: Share


రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు : కె. నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా

- ప్రజల సౌకర్యార్థం రోడ్డు అక్రమణలు తొలగిస్తాం.

- మున్సిపాలిటీ తో సమన్వయం చేసుకొని జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం.

డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఖమ్మం అండర్ పాస్ వద్ద జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ పోలీస్ సిబ్బందితో కలిసి రోడ్ ఆక్రమణలను పరిశీలించారు. స్థానికంగా ఉన్న వ్యాపారస్తులతో మాట్లాడి రోడ్డు ఆక్రమణల వల్ల తలెత్తే సమస్యలను అవగాహన కల్పించారు. రోడ్లు ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపారాలను, బోర్డులను తొలగించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది, ప్రజలు వారి అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రానికి పెద్ద సంఖ్యలో వచ్చి పోతుంటారు, సూర్యాపేట కేంద్రంలో వాహనాల రద్దీ బాగా పెరుగుతున్నది దానికి అనుగుణంగా పోలీసుల వాహనాల రద్దీని పునరుద్ధరిస్తూ పని చేస్తున్నారు అని తెలిపారు. రోడ్లని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం వల్ల వాహనదారులకు, సాధారణ ప్రజలకు, బాటసారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నారు. దుకాణదారులు, వ్యాపారులు ఎవరు కూడా రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించకూడదని సూచించారు. రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, సంబంధిత మున్సిపాలిటి అధికారులతో కలిసి రోడ్డు ఆక్రమించిన వ్యాపారాలను తొలగిస్తామని దీనిపై జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపినారు. రోడ్లపై వ్యాపారాలు నిర్వహించడం వల్ల వాహనదారులు వారి వాహనాలను రోడ్డు మధ్యలో నిలిపివేస్తున్నారు అన్నారు. ప్రజల సౌకర్యార్థం రోడ్ల ఆక్రమణలను తొలగిస్తాం అన్నారు. వ్యాపారులు పోలీసు వారికి సహకరించాలని కోరారు, దుకాణాల వద్ద CC కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.


Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >