| Daily భారత్
Logo




కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

News

Posted on 2026-09-01 15:32:20

Share: Share


కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

డైలీ భారత్, వేములవాడ:వేములవాడ పట్టణంలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది.

కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం ముగించుకుని హైదరాబాద్‌కు వెళ్తున్న భక్తుల కారు వేములవాడలోని ఇండియన్ గ్యాస్ గోదాం సమీపంలో అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను బలంగా ఢీకొట్టింది.

ఢీకొన్న ధాటికి ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక భాగం కూలిపోయింది. గ్యాస్ గోదాంకు అతి దగ్గరలోనే ప్రమాదం జరగడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేపింది. గోదాం వైపు దూసుకెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు అంటున్నారు.

అదృష్టవశాత్తూ కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో కారులోని భక్తులకు ప్రాణాపాయం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

#Vemulawada #RajannaSircilla #RoadAccident #Kondagattu

Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >