Posted on 2025-07-07 18:06:14
అవాక్కైనా అధికారులు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్ : అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు సోమవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏకంగా జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలనకు అదనపు కలెక్టర్ విక్టర్ ను అదేశించారు. కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ విక్టర్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. వంట గదిని, స్టోర్ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలసి మద్యహ్న భోజనం చేశారు. ఆయన తినే భోజనంలోనే పురుగులు రావడంతో అధికారులు అవాక్కయ్యారు. విద్యార్థులకు హస్టల్ లలో సన్నబియ్యం, నాన్ వెజ్ మెనూ అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. బియ్యంను ప్రభుత్వం సరఫరా చేస్తుండగా ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ ఇస్తుండగా పురుగులు ఎలా వచ్చాయనే సంశయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినీలు పురుగులు వస్తున్నాయని రోడ్డెక్కగా, అదనపు కలెక్టర్ తో పాటు అధికారులు మధ్యాహ్నం భోజనం చేస్తే అందులో పురుగులు రావడంతో అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో అనే విషయం తేట తెల్లమైంది. పురుగుల అన్నంను విద్యార్థులకు వండి వార్పుతున్న గిరిజన బాలికల గురుకుల శాల అధికారులు, సిబ్బందిపై ఎలాంటి చర్యలు అనుకుంటారో వేచి చూడాలి.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >