| Daily భారత్
Logo




బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-04-21 13:38:06

Share: Share


బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జనగణన - 2027ను సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

జనగణన 2027 లో భాగంగా హౌస్ లిస్టింగ్ బ్లాక్స్, సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ విధానం, స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) పై సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు  సిరిసిల్ల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆఖరి రోజు శిక్షణ కొనసాగుతుండగా, మంగళవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. జన గణనకు సంబంధించిన కిట్లను సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. మొదటి దశలో మే 11 వ తేదీ నుంచి జూన్ 09 వ తేదీ వరకు ఇండ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027 లో వ్యక్తుల వారిగా సమాచారం సేకరిస్తారని అధికారులు తెలిపారు. ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా సేకరించి.. నమోదు చేయాలని ఆదేశించారు. అందరి వివరాలు గోప్యంగా ఉంచాలని స్పష్టం చేశారు.

ఎండాకాలం నేపథ్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీటి బాటిల్ వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ఈ నెల 26 వ తేదీన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ? చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా చేసుకోవాలని ఆదేశించారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బాధ్యతల నిర్వహణలో ఎంతో కీలకమని స్పష్టం చేశారు. వివరాలు పక్కాగా సేకరించి నమోదు చేయించాలని ఆదేశించారు.


కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, ఛార్జ్ అధికారులు మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, మహేష్ కుమార్, ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.


#sircilla #sircillacollector #garimaagrawal #sircillanews #rajannasircilla #sircilla_rajanna_district

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >