Posted on 2026-09-01 16:29:17
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రతకు సహకరించాలి
కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్
డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి: ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ సూచించారు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత మరియు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ సీఐ శ్రీ నరహరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డీఎస్పీ మధుసూదన్ ముఖ్య అతిథిగా హాజరై ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ఆటో డ్రైవర్లు వాహనాలకు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎస్పీ సూచించారు. ప్రయాణికుల భద్రతతో పాటు తమ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని వాహనాలు నడపాలని తెలిపారు.
నిబంధనల ఉల్లంఘనకు చర్యలు
కామారెడ్డి పట్టణ ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని సూచించారు. రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ ఉపయోగించడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.
అలాగే ఆటోల్లో ఓవర్‌లోడ్ చేయకూడదని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత ప్రతి డ్రైవర్‌పై ఉందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సైబర్ నేరాలపై అప్రమత్తత
సైబర్ క్రైమ్ ఎస్సై నరేష్, రామంచ తిరుపతి కళాబృందం సభ్యులు ఆటో డ్రైవర్లకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులు, మోసపూరిత సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకుండా, వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ తెలియజేయవద్దని తెలిపారు.
ప్రజలకు లేదా వాహనదారులకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన సమాచారం తెలిసినప్పుడు వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని పోలీసులు కోరారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులు, పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రతకు, కామారెడ్డి పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని ఆటో డ్రైవర్లు తెలిపారు.
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >