| Daily భారత్
Logo




ఎసిబి కి చిక్కిన SI

News

Posted on 2026-09-02 05:22:18

Share: Share


ఎసిబి కి చిక్కిన SI

కుటుంబ వివాదం పరిష్కారానికి లంచం డిమాండ్.. కటకటాల్లోకి సబ్‌ ఇన్‌స్పెక్టర్.

డైలీ భారత్, హైదరాబాద్:బాధితుడి నుంచి రూ.10,000 లంచం తీసుకుంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ గోల్కొండ జోన్ పరిధిలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) ఆర్. పాండు నాయక్ మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం ఫిర్యాదుదారుడిపై ఆయన తల్లి ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి కేసు నమోదు చేయకుండా ఉండటానికి, కుటుంబ సభ్యుల మధ్య వివాదాన్ని సయోధ్యతో పరిష్కరించడానికి మరియు ఫిర్యాదుదారుడి పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయకుండా ఉండటానికి ఎస్ఐ పాండు నాయక్ రూ.10 వేల లంచం డిమాండ్ చేశారు. 

బాధితుడి నుంచి ఎస్ఐ డబ్బులు స్వీకరిస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్-1 బృందం అదుపులోకి తీసుకుని, ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుంది. అనంతరం ఎస్ఐ పాండు నాయక్‌ను అరెస్టు చేసి నాంపల్లిలోని ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల ప్రధాన ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ (9440446106) ద్వారా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >