| Daily భారత్
Logo




వికలాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

News

Posted on 2025-07-07 17:11:49

Share: Share


వికలాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

త్వరలో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో తమ హక్కుల సాధనకై సీఎం రేవంత్ రెడ్డి పై ఒత్తిడి తీసుకొస్తాం

వికలాంగుల మహిళ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి

డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: రాష్ట్రంలో రోజురోజుకీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు కావాల్సిన కనీస వసతులు కల్పించడంలో విఫలం చెందుతున్నారని వికలాంగుల మహిళ అధ్యక్షురాలు సూర్య వంశీ అన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగులకు పింఛన్ విషయంలో 1000 రూపాయలు అదనంగా మంజూరు చేస్తామని ప్రకటించి ఇప్పుడేమో మోసం చేశారని విమర్శించారు. సోమవారం వికలాంగుల నవిపేట మండల అధ్యక్షుడు భయ్యా సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సుజాత సూర్య వంశీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు వికలాంగులకు పెన్షన్ విషయంలో న్యాయం చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పడమే కాకుండా రాష్ట్రంలో వికలాంగుల కొరకు ఎలాంటి సంక్షేమ ఫలాలు అందించకపోవడం అన్యాయమన్నారు. అలాగే పెన్షన్ కూడా గత సర్కార్ కంటే వెయ్యి రూపాయలు అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందించి మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే త్వరలో ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆమె హెచ్చరించారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >