Posted on 2025-07-06 13:56:08
స్టేజిపై స్టెప్పులేసి అభిమానులను ఉర్రూతలూగించిన అనసూయ
నగరంలో ఏకాది సిల్వర్ షోరూంను ప్రారంభించిన అనసూయ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సిల్వర్ జువెలరీ షోరూమ్ ను అర్బన్ ఎమ్మెల్యే దండుపాల్ సూర్యనారాయణ గుప్తా తో పాటు అనసూయ భరద్వాజ్ లు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ కు రావడం చాలా ఆనందంగా ఉందని, నిజామాబాద్ లో తనకు ఇంతగా అభిమానులు ఉండడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు. నీటి జ్వరానికి నచ్చే విధంగా జువెలరీస్ ను గ్రామీణ, పట్టణ స్థాయి ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ఏకాదశి షోరూం వారు తొలి ఏకాదశి రోజు పర్వదినాన మహిళా మణుల కోసం ప్రారంభించడం శుభసూచికమన్నారు. ఈ జ్యువలరీ వ్యాపారం అభివృద్ధి చెంది రాష్ట్రంలో మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని ఆమె ఆకాంక్షించారు. ఏకాది షోరూమ్ లో విభిన్న రకాల జువెలరీ తనకు ఎంతగానో నచ్చాయని ఆమె అన్నారు. ఇప్పటికే మూడు బ్రాంచులు ఉన్న ఈ షో రూమ్ లో మరిన్ని బ్రాంచ్ లతో వజ్రా వ్యాపారంలో ముందుకు వెళ్లాలని ఆమె కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మూడు బ్రాంచీలు ఉన్న ఈ జువెలరీ షోరూమ్ దేశవ్యాప్తంగా మరిన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించాలని ఆకాంక్షించారు. సిల్వర్ పై గోల్డ్ కోటెడ్ జ్యువెలరీ ఉన్న అభరణాలు సాధారణ మహిళలకు కూడా ఎంతగానో నచ్చుతాయని అన్నారు. అనంతరం షోరూం ఆవరణలో ఏర్పాటు చేసిన స్టేజిపై ఫోజులిస్తూ అభిమానులకు ఫోన్లో సెల్ఫీలు దిగారు. రంగస్థలం, పుష్ప2 నటించి తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నానని పుష్ప3 కూడా నటిస్తున్నారా అని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు దర్శకుడు సుకుమార్ అవకాశం కల్పిస్తే నటించడానికి తనకి అభ్యంతరం లేదని అన్నారు. అలాగే రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ తేజకు అత్త పాత్ర నటించారు. మళ్లీ అలాంటి పాత్రలు చేయబోతున్నారా అని ప్రశ్నించగా తన కెరీర్ లో ఒకసారి చేసిన పాత్ర మళ్లీ, మళ్లీ చేయడానికి అంతగా ఆసక్తి ఉండదని స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతారని అన్నారు. జబర్దస్త్ టీవీ ప్రోగ్రాం ద్వారా తెలుగు చిత్ర సీమలో అనసూయ మళ్లీ జబర్దస్త్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నారా అని అడగగా సర్ప్రైజ్ అని సమాధానం ఇచ్చారు. స్టేజ్ పై ఆమె వివిధ పాటలకు స్టెప్పులేసి ఇందూరు ప్రజలను ఉత్తేజపరిచారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >