Posted on 2025-07-06 14:30:12
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కామారెడ్డి లో దొరికిన నిషేధిత పేలుడు పదార్థాలు( జిలేటిన్ స్టిక్స్ అక్రమ వినియోగం, నిలువ కేసులో గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల పీసీసీ కార్యవర్గంలో కామారెడ్డి జిల్లా నుంచి చోటు దక్కించుకున్న వారిలో ఇతను ఒక్కడు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సతీమణి గడ్డం ఇందుప్రియ తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్. కామారెడ్డి పట్టణంలోని కేపీఆర్ కాలనీలో ఇటీవల శ్రీధర్ అనే వ్యాపారి చేపట్టిన ఇంటి నిర్మాణంలో అడ్డుగా ఉన్న బండరాళ్ల ను తొలగించేందుకు జీలేటిన్ స్టిక్స్ వాడటంపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులు బొంత సత్యనారాయణ, బొంత సంపత్, బొంత రాజులు తోపాటు శ్రీధర్ ను పోలీసులు అరెస్టు చేశారు. సంబంధిత జిలిటిన్ స్టిక్కులను కామారెడ్డి పట్టణం లింగాపూర్ శివారులోని శ్రీవారి ఏకో వెంచర్ లో నిలువ ఉంచగా అందులో గడ్డం ద్రశేఖర్ రెడ్డి పాత్ర ఉందని పోలీసులు కేసు నిమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిసింది. చంద్రశేఖర్ రెడ్డి పాత్ర ఉందని పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. తాజాగా లైసెన్స్ లేకుండా నిషేధిత పేలుడు పదార్థాలు నిర్వహించారన్న కారణంతో ఆయనను అరెస్టు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ విషయంపై గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సతీమణి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >