Posted on 2025-07-02 13:34:42
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలోని గణేష్ నగర్ లో ఈరోజు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ కార్మికులకు మనో వికాస సదస్సును నిర్వహించినారు.
ఈ సందర్భంగా పున్నంచందర్ మాటడుతూ కార్మికులు మద్యపాన వ్యసనం నుండి విముక్తి పొందాలని అన్నారు.
మద్యపాన వ్యసనం సైకో సోమాటిక్ డిసార్డర్ వ్యాధి అని తెలుపుతూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అన్నారు.
మద్యపాన వ్యసనం నుండి బయట పడేందుకు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ లో సైకాలజిస్ట్ మరియు సైకియాట్రస్ట్ లను ఏర్పాటు చేసిందని తెలిపారు.
మద్యపాన వ్యసన పరులకు కౌన్సిలింగ్, చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా మద్యపాన వ్యసనం నుండి బయట పడవచ్చని అన్నారు.
మైండ్ కేర్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ మరియు కార్మికులు పాల్గొన్నారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >