Posted on 2025-06-30 05:08:50
డైలీ భారత్, అన్నమయ్య జిల్లా: రోడ్డు ప్రమాదం లో ముగ్గురు దుర్మరణం పాలైన విషాద ఘటన అన్నమయ్య జిల్లా లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి కి చెందిన ఓ బృందం టెంపోలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నేపథ్యంలో వారి టెంపోను అన్నమయ్య జిల్లా కురబలకోట మండల పరిధిలోని చెన్నామర్రి మిట్ట వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో టెంపో పూర్తిగా నుజ్జునుజ్జు కాగా.. ముగ్గురు అక్కడికక్కడే తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్సుల ద్వారా మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి అత్యవసర చికిత్సను అందజేస్తున్నారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >