| Daily భారత్
Logo




వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

News

Posted on 2026-06-06 07:14:23

Share: Share


వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

ఒక్క ఫోన్ కాల్ చేస్తే...మీకు రక్షణ కవచంలా నిలబడటానికి "షీ టీమ్" ఎల్లప్పుడూ సిద్ధం.

జిల్లాలో గడిచిన 5 నెలల కాలంలో ఆకతాయిలపై 14 FIRs,16 పెట్టి కేసులు నమోదు

హాట్‌స్పాట్స్‌ ల వద్ద షీ టీమ్ మఫ్టీలో నిఘా .. మహిళల భద్రతకు భరోసా.

 జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:  మహిళలు,బాలికలు, విద్యార్థినిలు ఎలాంటి వేధింపులు ఎదురైనప్పుడు మౌనంగా భరించకుండా నిర్భయంగా ఫిర్యాదు చేస్తే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.

గడిచిన 05 నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో  14 FIRలు,16 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...జిల్లాలో మహిళల,విద్యార్థినిల రక్షణకై పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని,మహిళలు, విద్యార్థినిలు, బాలికలు వేధింపులకు గురైనప్పుడు వెంటనే ఒక ఫోన్ కాల్ చేస్తే మీకు రక్షణ కవచంలా జిల్లా షీ టీమ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాదని తెలిపారు.

ముఖ్యంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని,వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.

జిల్లాలో షీ టీమ్ బృందం విద్యాసంస్థల్లో, మహిళలు పని చేసే ప్రదేశాల్లో,రద్దీగాల ప్రాంతాల్లో విద్యార్థులకు, మహిళలకు,ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ సోషల్ మీడియా మోసాలు/ మహిళ చట్టలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

జిల్లాలో గుర్తించిన హట్స్పాట్స్ వద్ద షీ టీమ్ బృందం నిత్యం మఫ్టీ డ్రెస్ లలో నిఘా ఉంచి మహిళలను,విద్యార్థిని లను వేధించే ఆకతాయిలను అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.

విద్యాసంస్థలల్లో,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో  అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనేజిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ తెలిపారు.

Image 1

గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్...

Posted On 2026-07-23 16:17:18

Readmore >
Image 1

ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం

Posted On 2026-07-23 16:06:22

Readmore >
Image 1

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-23 16:04:59

Readmore >
Image 1

వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-23 15:59:08

Readmore >
Image 1

మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు

Posted On 2026-07-23 15:56:26

Readmore >
Image 1

నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం

Posted On 2026-07-23 15:54:39

Readmore >
Image 1

సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ

Posted On 2026-07-23 14:52:41

Readmore >
Image 1

జూలై 24 విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి

Posted On 2026-07-23 13:29:46

Readmore >
Image 1

తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-23 13:29:02

Readmore >
Image 1

చెరువులోకి దూసుకెళ్లిన కారు...ఐదుగురి మృతి

Posted On 2026-07-23 12:58:50

Readmore >