Posted on 2025-06-28 17:44:45
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రమాదవశాత్తు గోడ కూలి నడుము మీద పడడంతో గుబ్బల సతీష్ వెన్నుపూస దెబ్బతిని రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి.
కుటుంబ పోషణకు ఆటోడ్రైవర్ వృత్తిగా జీవనం సాగిస్తున్న సతీష్ గత 15 సంవత్సరాలుగా మంచానికే పరిమితమై అవస్థలు పడుతున్న దీన పరిస్థితి.
ఆర్థికంగా కుటుంబం నలిగిపోతుంది. వైద్యం, మెడిసిన్స్ కొరకు వేలాది రూపాయలు ఖర్చవుతుంది.
సతీష్ దీన పరిస్థితి కుటుంబ ఇబ్బందులను ఆర్థిక ఇబ్బందులను గమనించిన గండికోట కిరణ్ గుబ్బల సతీష్ ఇంటికి వెళ్లి పరామర్శించి, అతని ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుని నేనున్నానని ధైర్యం చెబుతూ.. సతీష్ కు ప్రతినెల వెయ్యి రూపాయలు మెడికల్ ఖర్చులకు అందజేస్తున్నారు.
ఈనేపథ్యంలో సతీష్ రెండు కాళ్లు తొలగించకుంటే ప్రాణాలకే ప్రమాదమని, హైదరాబాద్ లోని ఓ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు.
సాయం చేయటానికి మంచి మనసుతో పాటు ఆర్థిక సాయం కూడా చేసే తత్వం ఉన్న కిరణ్ వారికి అండగా నిలిచి మెడికల్ ఖర్చుల నిమిత్తం ఐదువేల రూపాయలను ఆర్థిక సహాయం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
అంతేకాకుండా ఆపరేషన్ తరువాత గుబ్బల సతీష్ వారి కుటుంబ బతుకుతెరువు కోసం వ్యాపారం చేసుకుంటామని తెలిపారు.
ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయి ఇంతకన్నా మానవత్వం దైవత్వం మరొకటి లేదు అనే కొటేషన్లు చదువుకొని వదిలిపెట్టే వారే ఉన్న నేటి సమాజంలో అందుకు భిన్నంగా కిరణ్ కుమార్ గండికోట ఆచరణలో చేసి చూపుతున్నారు..
గుబ్బల సతీష్ కుటుంబం వ్యాపారం చేసుకోవడానికి అవసరమయ్యే పెట్టుబడి పెడతానని హామీ ఇచ్చారు.. దీంతో పట్టణంలోని పలువురు జర్నలిస్ట్ కిరణ్ కుమార్ గండికోట రీల్ హీరోల కంటే రియల్ హీరో అంటూ అభినందనలు తెలుపుతున్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >