| Daily భారత్
Logo




తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం తెల్లవారుజామున చోరీకీ యత్నం

News

Posted on 2025-06-29 12:23:12

Share: Share


తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం తెల్లవారుజామున చోరీకీ యత్నం

డైలీ భారత్, విశాఖపట్నం: విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కొందరు దుండగులు భారీ దొంగతనానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

దొంగతనాలకు పాల్పడిన వారు బీహార్‌, మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్‌లుగా గుర్తించారు.

వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం తెల్లవారుజామున చోరీ యత్నం జరిగింది. ఈ క్రమంలో రైల్వే పోలీసులు.. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో, దొంగల ముఠా పారిపోయింది. అయితే, పిడుగురాళ్ల సమీపంలో వరుసగా రైళ్లలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్‌లు దొంగతనానికి పాల్పడుతున్నాయి. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, వారం రోజుల వ్యవధిల ఇప్పటికే రైళ్లలో రెండు సార్లు దొంగతనం జరిగింది. తాజాగా మూడోసారి ఆదివారం తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడటంతో గాలిలోకి కాల్పులు జరిపినట్టు రైల్వే పోలీసులు చెప్పుకొచ్చారు.

Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >