డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణరాష్ట్రంలో విద్యావ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.33జిల్లాల్లోని జిల్లా కలెక్టర్లు అధికారులు వారానికి 2 పాఠశాలలను సందర్శించాలని విద్యాశాఖ సమీక్షలో సూచించారు. ఈ ఏడాది పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు నిర్మించాలని చెప్పారు. మధ్యాహ్న భోజనం తయారీకి సోలార్ కిచెన్ల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. టెన్త్ పాసైన విద్యార్థులు కచ్చితంగా ఇంటర్లో చేరేలా చూడాలని తెలిపారు.
News
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు వారానికి రెండు పాఠశాలలు సందర్శించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి